Hero Singam Suriya who earns a unique image with different kind of films like Ghajini, Yamudu, Singam is coming with a political thriller 'NGK' (Nandha Gopala Krishna) '7G Brundavana Colony', 'Aadavari Matalaku Ardhale Verule' fame Sri Raghava has Directed the film Produced by Dream Warrior Pictures and Reliance Entertainment. Popular Producer KK Radhamohan who produced Superhit films like 'Emaindi Ee Vela', 'Adhinetha', 'Bengal Tiger' in his Sri SathyaSai Arts banner is releasing 'NGK' in Telangana, Andhra Pradesh states. 'NGK' is releasing worldwide on May 31st.
#ngkpublictalk
#ngkrtelugureview
#suriya
#rakulpreetsingh
#saipallavi
#sriraghava
#kkradhamohan
#tollywood
దక్షిణాదిలో విలక్షణ నటుడిగా పేరున్న సూర్య, 7జీ బృందావన కాలనీ, ఆడవారికి అర్ధాలే వేరులే లాంటి చిత్రాలు రూపొందించిన సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో NGK సినిమా అనగానే విపరీతమైన బజ్ ఏర్పడింది. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లు అనగానే మరింత హైప్ ఏర్పడింది. ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలను పెంచాయి. ఇటీవల ఇంటర్వ్యూలో హీరో, హీరోయిన్లు సూర్య, రకుల్ చెప్పిన విషయాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిఅందించిందో తెలుసుకోవాలంటే సినిమాను సమీక్షించాల్సిందే.
నంద గోపాల కృష్ణ అలియాస్ NGK ఎంటెక్ చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆర్గానిక్ వ్యవసాయంపై మక్కువతో జాబ్‌ను వదిలేసి తన సొంత ఊరు శృంగవరపు కోటకు వస్తాడు. భార్య (సాయిపల్లవి)తో హ్యాపీగా జీవితం సాగిస్తూనే, పోరాటలు చేస్తూ ప్రజలను చైతన్యం చేసే దిశగా అడుగులేస్తుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా గ్రామ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ క్రమంలో అధికార పొలిటిక్ పార్టీలోని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వనిత (రకుల్)తో సన్నిహిత సంబంధాలు పెట్టుకొంటాడు. అలా గ్రామీణ స్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెడుతాడు. NGK ఎదుగుదలను చూడలేక అధికార, ప్రతిపక్ష పార్టీలు కక్ష కడుతాయి.